ఆవంచ గేటు వద్ద స్కూటీ అదుపుతప్పి వ్యక్తి మృతి

నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో తమ్మయ్యపల్లికి చెందిన సేవళ్ల శ్రీనివాస్ రెడ్డి దుర్మరణం పాలయ్యారు. బంధువుల వివాహ వేడుకకు వెళ్లి తిరిగి స్కూటీపై వస్తుండగా ఆవంచ గేటు వద్ద వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్