పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మ‌హ‌త్య

చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో వ్యక్తి  పోచయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 21న మద్యం మత్తులో భార్య, కుటుంబ సభ్యులతో గొడవపడి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ విఠల్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్