మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో బోరుబావి వివాదంలో చలిమల రమేష్ గౌడ్(45)ను గొడ్డలితో హత్య చేసిన కేసులో నిందితుడు పంపరి నాగేందర్‌కు జిల్లా న్యాయమూర్తి నీలిమ జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఈ హత్య 2021 సెప్టెంబర్ 8న జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. నేరం రుజువైనట్లు వివరించిన ఎస్పీ, నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను అభినందించారు.