వెల్దుర్తిలో వాహనదారుడికి గాయాలు

వెల్దుర్తిలో పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డుపై వరి ధాన్యం ఆరబోయడం, అడ్డంగా రాళ్లు పెట్టడం వల్ల వాహనదారుడు నియంత్రణ కోల్పోయి కిందపడిపోయాడు. ఈ ఘటనలో ధర్మారం గ్రామానికి చెందిన వ్యక్తి గాయపడగా, అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డుపై ధాన్యం ఆరబోయడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇది మరింత ప్రమాదకరమని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్