సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన మల్లెల శంకర్, నాగల్ గిద్ద పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఉపాధ్యాయ వృత్తి గొప్పదని, శంకర్ గారు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. పదవీ విరమణ తర్వాత కూడా సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.