మాజీ ఎమ్మెల్యేను కలిసిన బంజారా నాయకులు

నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి వచ్చిన బంజారా నాయకులు ఆదివారం రోజున హైదరాబాద్ లోని తన స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే కిషన్ సింగ్ ను కలిసి శాలువాతో సన్మానించి, ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కిషన్ సింగ్ 1983లో బాన్సువాడ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో రమేష్ చౌహన్, పర్షురామ్, జీవన్, రాజేందర్, శ్యామ్ సుందర్, బలిరామ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్