భగత్ సింగ్ జయంతి: మోర్గి మోడల్ స్కూల్లో ఘన నివాళి

సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలంలోని మోర్గి మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో సోమవారం స్వాతంత్ర్య సమరయోధుడు షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయులు భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన త్యాగాలు, విప్లవ పోరాటాలను విద్యార్థులకు వివరించారు. "ఇంక్విలాబ్ జిందాబాద్" నినాదం ప్రాముఖ్యతను తెలియజేశారు. భగత్ సింగ్ ధైర్యసాహసాలు, దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, ధైర్యసాహసాలు నింపేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్

✕
✕