నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలంలోని బోరంచ గ్రామంలో ఆదివారం ఆషాఢ బోనాల పండుగను గ్రామస్థులు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం పోతురాజుల విన్యాసాలతో బోనాల ఊరేగింపు ప్రారంభమై.. శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం వరకు సాగుతుంది. శనివారం రాత్రి భజనలతో పాటు, ఆదివారం అన్నదాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.