బోరంచ శ్రీ నల్లపోచమ్మకు బోనాలు

మనూరు మండలం బోరంచ శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో మహిళలు గురువారం బోనాల వేడుక నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను ధరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించారు. భక్తులు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను జరిపించారు. అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్