హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి లో ఈనెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. మనూర్ లో కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పారు. మండలం నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.