నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని కారాముంగి గ్రామంలో శనివారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతిని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా TRRS మీడియా కార్యదర్శి బి శరణప్ప కారాముంగి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం అందరికీ ఆదర్శమని అన్నారు.