కల్హేర్ మండలంలోని కృష్ణాపూర్ గ్రామంలో పిల్లలు ఎంతో సంతోషంగా పర్యావరణ అనుకూల మట్టి వినాయకుడిని నిమజ్జనం చేశారు. చిన్న పిల్లలు ఎటువంటి హంగులు, పెద్ద డిజెలు లేకపోయినా వారే చిన్న డ్రమ్స్ వాయిస్తూ, పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో చిన్న మట్టి వినాయకుడిని వీధి గుండా నిమజ్జనానికి తీసుకెళ్లిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.