ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికుల దాడి!

నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో టికెట్ లేని ప్రయాణికుడి నుంచి జరిమానా వసూలు చేయాల్సింది పోయి, కండక్టర్‌ను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన చెకింగ్ అధికారి ప్రకాష్‌పై కండక్టర్, ప్రయాణికులు దాడి చేశారు. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న బస్సును రాయికోడ్ బస్టాండ్ వద్ద ప్రకాష్ తనిఖీ చేయగా ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు, కండక్టర్ కలిసి పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాన్ని అడ్డుకుని నిలదీశారు. అనంతరం ప్రకాష్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో రాయికోడ్ బస్టాండ్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అధికారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

సంబంధిత పోస్ట్