నిజాంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ SC సెల్ అధ్యక్షులు సీమాన్ మంగళవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ, పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడిగా నియమించడం సంతోషకరమని, ఆయన సేవలు పార్టీకి అవసరమని అన్నారు. చంద్రశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉందని, విద్యార్థి నాయకుడిగా, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, డిసిసి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా వివిధ బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోదరుడైన చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కడం పట్ల కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని, మారుమూల ప్రాంత నాయకునికి కీలక బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని ఆయన అన్నారు.