విద్యార్థుల క్రీడా దుస్తుల కోసం రూ.10 వేల విరాళం

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం, నాగల్‌గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు కొనుగోలు చేయడానికి గ్రామ సర్పంచ్ శ్రీ సుభాష్ చంద్రబోస్ రూ. 10,000 విరాళంగా బుధవారం అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆయన అందించిన సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముక్తాపూర్ సర్పంచ్ శ్రీ సుభాష్ చంద్రబోస్, నాగల్‌గిద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాణిక్‌రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్