విద్యుత్, నీటి సమస్య: గురుకుల విద్యార్థుల ఆందోళన

నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలంలోని ఎస్సీ గురుకులంలో విద్యార్థులు గత 10 రోజులుగా విద్యుత్, తాగునీరు, స్నానానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వార్డెన్ తమను బెదిరిస్తున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు అధికారులను వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్