నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే స్వగృహంలో బుధవారం నాగల్గిద్ద మండల పరిధిలోని దామర్ గిద్ద గ్రామానికి చెందిన రైతులకు రైతు బీమా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి చేతుల మీదుగా రైతు బీమా మంజూరైన లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు రైతు బీమా పథకం ఒక గొప్ప వరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హట్కార్ కళావతి శంకర్, ఏఇఓ సంతోష్, స్థానిక సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.