సిర్గాపూర్ మండలం బొక్కస్ గాంలో సొసైటీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. అవినీతికి పాల్పడిన వ్యక్తి ఎవరో అధికారులను నిలదీశారు. ఈ విషయంలో మరో వర్గం రైతులు వాదోపవాదాలకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. రైతుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేయడంతో రైతులు మరింత ఆగ్రహించారు.