కల్హేర్ మండల కేంద్రంలోని దత్తాత్రేయ గణేష్ మండపంలో నేడు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం జరగనుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వినాయకుడి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుపబడుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు, గ్రామస్తులు, యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా దత్తాత్రేయ గణేష్ మండపంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు.