40 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా వినాయకుడికి పూజలు

సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని వెంకటాపూర్ గ్రామంలో గత 40 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా గ్రామ ప్రజలు, పెద్దలు ఏకమై ఒకే వినాయకుడిని ప్రతిష్టించి 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని గ్రామ సర్పంచ్ గోస్కె సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారని ఆదివారం ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పూర్ర సాయిలు, గ్రామ పెద్దలు, శ్రీ మార్కండేయ కమ్యూనికేషన్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕