నారాయణఖేడ్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం సభ్యులను మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలికితీసి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తగిన గౌరవం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, ఈసీ సభ్యుడు హసీబ్ పాటిల్, నియోజకవర్గ అధ్యక్షుడు సత్యం, రాములు, భూమయ్య, ఉపాధ్యక్షులు విఠల్, బిరాదర్ సంగప్ప, ఇతరులు పాల్గొన్నారు.