సిర్గాపూర్ మండలంలోని ఖాజాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిబుధవారం సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండపం నిర్వాహకులు, గ్రామస్తులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.