సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని కట్ట మైసమ్మ దేవాలయంలో బోనాల కార్యక్రమానికి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో ఆయన కూతురు బీఆర్ఎస్వి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మహారెడ్డి శ్రేయ రెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు.