సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం, తూర్కపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ ఈశ్వరప్ప హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. అనంతరం, ఆయన మాజీ సర్పంచ్ పాడెను కూడా మోశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపిటిసిలు దత్తు గౌడ్, దామన్న, గ్రామ నాయకులు, నియోజకవర్గ నాయకులు, బంధువులు పాల్గొన్నారు.