నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం, కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామంలో స్కోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం, సెప్టెంబర్ 2న ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మల్దొడ్డి శశికళ, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి, గ్రామ పెద్దలు, పాలకవర్గ సభ్యులు, ఆశా వర్కర్లు హాజరయ్యారు. నారాయణఖేడ్ ఐసీటీసీ కౌన్సిలర్ నర్సింలు, స్కోప్ సూపర్ వైజర్ సూర్య నగేష్ కుమార్, సీఎల్ డబ్ల్యూ మారుతి, భరత్, కుమార్ తదితరులు పాల్గొని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవగాహన కల్పించారు.