రాపర్తిలో ఘనంగా గణేష్ లడ్డూ వేలం పాట

రాపర్తిలో రాపర్తి శ్రీ యోగేశ్వర యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం గణేష్ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. ఈ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని లడ్డూలను దక్కించుకున్నారు. 2 కేజీ లడ్డూ రూ. 16,500, 6 కేజీ లడ్డూ రూ. 38,500, 11 కేజీ లడ్డూ రూ. 45,500, 5 సేపులు రూ. 11,000, బంగారు బొట్టు రూ. 7,500 చొప్పున అమ్ముడయ్యాయి. మొత్తం రూ. 1,19,000 వసూలైనట్లు నిర్వాహకులు తెలిపారు. వేలంలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులకు, దాతలకు మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕