కంగ్టి గ్రామంలో ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసిన గణేష్ లడ్డూ ధర

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కంగ్టి గ్రామంలో ఏర్పాటు చేసిన యోగి గణేష్ లడ్డూ వేలం భక్తుల ఉత్సాహం మధ్య ఘనంగా జరిగింది. ఈ వేలంలో యోగి గణేష్ లడ్డూకు రికార్డు స్థాయిలో ధర పలికింది. రూ. 5, 51, 000లకు కొల్లే సిద్ధారెడ్డి లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. వేలం కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు, గ్రామస్థుల్లో ఉత్కంఠ నెలకొంది. లడ్డూను సొంతం చేసుకునేందుకు పలువురు ఆసక్తి చూపడంతో వేలం ఉత్సాహభరితంగా సాగింది. చివరకు రూ. 5. 51 లక్షల వద్ద కొల్లే సిద్ధారెడ్డి అత్యధిక మొత్తాన్ని ప్రకటించి లడ్డూను సొంతం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕