మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ పోలీసులు డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్నారు. అక్టోబర్ 29, 2025న మధ్యాహ్నం చీలపల్లి బ్రిడ్జి వద్ద వాహన తనిఖీల్లో భాగంగా బలెనో కారు (TS08FF 3047)ను ఆపి తనిఖీ చేయగా, ఆరు ఖాళీ డబ్బాలు లభ్యమయ్యాయి. కారులో ఉన్న వనపర్తికి చెందిన సబవత్ రాహుల్, కామారెడ్డికి చెందిన కురుమ గణేష్, మహబూబ్‌నగర్‌కు చెందిన తోకల నాగరాజులను విచారించగా, హైదరాబాద్ పరిసరాల్లో లారీల నుంచి డీజిల్ దొంగిలించి బోరబండకు చెందిన అన్వర్‌కు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. అక్టోబర్ 22, 25 తేదీల్లో కూడా ఇదే కారుతో దొంగతనాలు చేసినట్లు వెల్లడించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు అన్వర్ పరారీలో ఉన్నాడు.