హత్నూర: ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

మంగళవారం రాత్రి హత్నూర మండలంలోని దౌల్తాబాద్ చౌరస్తా వద్ద నవాబుపేటకు చెందిన ఎర్రోళ్ల లక్ష్మణ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే మంటలు ఆర్పేసి, అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్