నారాయణఖేడ్ లో హోలీ సంబరాలు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో హోలీ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే పట్టణం రంగుల హరివిల్లుతో నిండిపోయింది. చిన్నారులు, యువత రంగుల చల్లాటాలతో ఉత్సాహంగా ఆటలాడారు. డీజే సంగీతానికి యువకులు నృత్యాలు చేస్తూ వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు. కుటుంబ సభ్యులు, మహిళలు కూడా రంగులు చల్లుకుంటూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. చిన్నా–పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్