నారాయణఖేడ్ పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు రంగులు అద్దుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.