బర్రెంకల కుంటలో సూచిక బోర్డు ఏర్పాటు

నార్సింగి మండల కేంద్రం నుంచి మిర్జాపల్లి వెళ్లే దారిలో బర్రెంకల కుంట కబ్జాకు గురైందని వచ్చిన కథనాలను సంబంధిత అధికారులు స్పందించారు. బుధవారం తహశీల్దార్ షేక్ కరీం, ఇరిగేషన్ ఏఈ ఆధ్వర్యంలో కబ్జాకు గురైన బర్రెంకల కుంటలో సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను, కుంటలను, చెరువులను కబ్జా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్