మానూర్ మండల కేంద్రంలో శుక్రవారం తహశీల్దార్ విష్ణు సాగర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు సంబంధిత దరఖాస్తు కాఫీలను నేరుగా కార్యాలయంలో అందజేయాలని, రేషన్ కార్డు దరఖాస్తుకు ఈనెల చివరి వరకు అవకాశం ఉందనే పుకార్లు నమ్మొద్దని, ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. అర్హులందరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.