జహీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డిఆర్డివో జ్యోతి తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ మేళా ఏర్పాటు చేశారు. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువకులు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.