కంగ్జి: పేకాడుతున్న ఏడుగురి అరెస్ట్

పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు కంగ్జి సీఐ వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు. కంగ్జి మండలంలోని భీమ్రా గ్రామంలోని గంగ్శెట్టి అనే కిరాణా షాపు ముందు పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో వెంటనే సీఐ, స్థానిక ఎస్సై దుర్గారెడ్డి సిబ్బంది కలిసి గురువారం రాత్రి దాడి చేశారు. 7మందిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో పేకాట ఆడితే చర్యలు తప్పవని CI హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్