కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో 30 రోజుల పాటు నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణ శుక్రవారం పూర్తయిందని గ్రామ స్వరాజ్య కోఆర్డినేటర్ మహానంద తెలిపారు. గ్రామ స్వరాజ్య సమస్థ ఆధ్వర్యంలో 40 మంది మహిళలకు కుటుంబ శిక్షణతోపాటు సర్టిఫికెట్‌తో పాటు 50% రాయితీపై మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పూజ, ఉపాధ్యాయులు తహుర్, సవిత, గంగామణి తదితరులు పాల్గొన్నారు.