నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అంత్వర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ఏడాది నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు కాగా, పూర్తి అయిన వెంటనే అదనంగా 1000 ఇళ్లు మంజూరవుతాయని తెలిపారు.