నారాయణఖేడ్ హంగిర్గ (కే) గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తులసీరాంకి ఇటీవల గుండెకు సంబంధించిన శాస్త్ర చికిత్స జరిగిన విషయం తెలుసుకొని శుక్రవారం వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి. వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు పండరి, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, నాయకులు లక్ష్మణ్ నాయక్, ముబ్బా బస్వరాజ్, తదితరులు ఉన్నారు.