ఖేడ్: భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

నారాయణాఖేడ్ మున్సిపల్ పట్టణంలోని భూమయ్య కాలనీలో శుక్రవారం శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో గృహరహితుల గోస తీర్చడానికి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసిందన్నారు. ఈ ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే అదనంగా 1000 మంజూరు అవుతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్