నారాయణఖేడ్ పట్టణానికి చెందిన రఘురాం మొబైల్ పోవడంతో మంగళవారం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారు. SI విద్యచరణ్ రెడ్డి ఆదేశాలతో కానిస్టేబుల్ రాహుల్ ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి ఒక గంటలోనే ఫోన్‌ను వెలికితీశారు. అనంతరం మొబైలును బాధితుడికి అప్పగించారు. SI విద్యచరణ్ రెడ్డి మాట్లాడుతూ ఫోన్ పోయిన వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.