ఖేడ్ పట్టణంలోని ర్యాకల్ రోడ్ వద్ద ఉన్న మొబైల్ షాప్‌లో శనివారం పట్టపగలే ఓ గుర్తుతెలియని వ్యక్తి రూ. 22,000 విలువైన మొబైల్ ఫోన్‌ను అపహరించి పరారయ్యాడు. షాప్ యజమాని షాఫీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖేడ్ ఎస్సై విద్య చరణ్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగను గుర్తించారు. అనంతరం బాధితునికి మొబైల్‌ను అప్పగించారు. ఘటనపై స్థానికులు పోలీసుల స్పందనను ప్రశంసించారు.