మోర్గి మోడల్ స్కూల్లో విద్యార్థులకు లాంగ్ మెమోలు అందజేత

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని పి యం, శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరంలో పదవ తరగతి జనరల్, వృత్తి విద్య విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బుధవారం ప్రిన్సిపాల్ టి. సువర్ణ చేతుల మీదుగా ఒరిజినల్ లాంగ్ మెమోలు అందజేశారు. ఈ వృత్తి విద్య సర్టిఫికెట్లతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వృత్తి విద్యా ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕