సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో కాశీనాథ్ పటేల్ నివాసంలో చంద్రగ్రహణం సందర్భంగా అరుదైన దృశ్యం కనిపించింది. తాంబాలంలో కొద్దిపాటి నీళ్లలో రోకలిని ఉంచగా అది ఎటువంటి ఆధారం లేకుండా నిటారుగా నిలిచింది. గ్రహణ సమయంలో ఉండే ప్రత్యేక శక్తి వల్లే రోకలి ఇలా నిలబడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రహణం ముగిసిన తర్వాత అది పడిపోతుందని చెప్పారు. ఈ వింతను చూసేందుకు స్థానికులు ఆసక్తిగా చేరుకున్నారు.