మకర సంక్రాంతి పండుగ సందర్భంగా, 12 జనవరి 2026, సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించబడతాయి. ఈ పోటీలలో కళాశాల విద్యార్థులు, గృహిణులు, మహిళలు పాల్గొంటారు. విజేతలకు శ్రీ దుర్గా లైఫ్ కేర్ హాస్పిటల్ సహకారంతో రూ. 5116, రూ. 3116, రూ. 2116 చొప్పున ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సబ్ కలెక్టర్ ఉమా హారతి, ఉమాదేవి షేట్కార్, పట్లోళ్ల అనుపమ రెడ్డి, మహారెడ్డి జయశ్రీ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆలయ కమిటీ తెలియజేసింది.