మనూర్: డ్యాంను పరిశీలించిన ఎమ్మెల్యే

రాయిపల్లి గ్రామ శివారులో సింగూర్ ప్రాజెక్టు నీటి విడుదల నేపథ్యంలో బయల్పడిన నిజాం కాలం నాటి పురాతన డ్యాంను నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి పరిశీలించారు. డ్యాం నిర్మాణ శైలిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ఈ పాత నిర్మాణాన్ని బేస్ చేసుకొని ఇక్కడ అత్యాధునిక రబ్బర్ డ్యాం లేదా నూతన ఆనకట్ట నిర్మిస్తే చుట్టుపక్కల వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్