తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం పరిధిలోని కల్హేర్ మండలంలోని మహాదేవ్ పల్లి గ్రామంలో మంగళవారం నాడు ఆయన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.