నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి లింగాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో సౌకర్యాలు, ధాన్యం నాణ్యతను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.