సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూమి, భుక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలంగాణ వీరవనితల సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లోని కోటి ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ శెట్కర్ మాట్లాడుతూ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు.