కల్హేర్ గ్రామపంచాయతీ పరిధికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. సర్పంచ్ కోడి గంగారం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ప్రభుత్వం పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా ఉంటూ కళ్యాణ లక్ష్మీ పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేష్, యువ నాయకులు నాగరాజ్, రాజేశ్వర్ గౌడ్, జనార్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.