నారాయణాఖేడ్ విద్యార్థిని రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక

నారాయణాఖేడ్ నియోజకవర్గానికి చెందిన ఈ-తక్షల పాఠశాల విద్యార్థిని రాకప్రియ, రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్ బాల్ ఛాంపియన్స్ పోటీలకు ఎంపికైంది. ఉమ్మడి మెదక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయి అవుట్డోర్ స్టేడియంలో జరిగిన ఎంపికల్లో ఆమె ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ నెల 3 నుంచి 5 వరకు నిజామాబాద్‌లో జరగనున్న ఈ పోటీల్లో రాకప్రియ పాల్గొంటుందని ఈ-తక్షల స్కూల్ ప్రిన్సిపల్ సుమ అవిక తెలిపారు.

సంబంధిత పోస్ట్